NEET: మే 4న నీట్.. కఠిన నిబంధనలు అమలు 11 d ago

దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి మే 4 న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ స్ధాయి అర్హత, ప్రవేశ పరీక్షకు (నీట్-యూజీ 2025) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్ష రాసేందుకు వచ్చే ప్రతి విద్యార్థిని మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్ధులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా చేరుకోవాల్సి ఉంది. 1.30 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని NTA స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 వేల మందికి నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.